11 Lakhs Applied for AP Sachivalayam Exams 2020 – Hall Tickets Soon

గత ఏడాది లక్షకుపైగా సచివాలయం ఉద్యోగాలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో ఈ పోస్టులపై అభ్యర్థులకు మంచి క్రేజ్ ఏర్పడింది. జనవరి 2020లో మళ్లీ కొత్త నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత నోటిఫికేషన్లో లక్ష పైగా పోస్టులకు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, ఈసారి 16వేల పైచిలుకు పోస్టులకు 11 లక్షల మంది పోటీ పడుతున్నారు. అంటే పోస్టుకు అభ్యర్థుల పోటీ నిష్పతి చాలా ఎక్కువగా ఉంది. About 5 lakhs candidates are applied for category 1 posts (Panchayat Secretary, Women Police, Ward Welfare and Development Secretary, Ward Administrative Secretary).

Grama Sachivalayam Previous Question Papers and Free Model Exams

10.96 లక్షల దరఖాస్తులు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం 2019 ఆగస్టు-అక్టోబరులో జరిగిన నియామక పరీక్షలకు ఒక్కో పోస్టుకు 17 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 2020 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం మరలా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి ఒక్కో పోస్టుకు ఏకంగా 67 మంది పోటీ పడుతున్నారు. అంటే భారీ పోటీ అన్నమాటే.

తాజా నోటిఫికేషన్లో 16,208 పోస్టులకు ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయగా, 10.96 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2019 జూలైలో 1,26,728 పోస్టులకు మొదటిసారిగా నియామక నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈసారి అభ్యర్థుల మధ్య ఒక్కో పోస్టుకు పోటీ నాలుగు రెట్లు పెరిగింది.

Ward Sachivalayam Hall Tickets Download

పోస్టుల వారీగా దరఖాస్తులు (Post wise applications for Sachivalayam Jobs 2020):

Category 1 posts: 4.5 lakhs candidates
Digital Assistants Posts: 2.22 lakhs candidates
VRO and Village Surveyor posts: 1.13 lakhs candidates
Animal Husbandry posts: 44691

16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ ఏడాది జనవరి 10న ప్రభుత్వం 2nd notification జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 10,96,740 మంది అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.

Category 1 tops in applications:

గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులతో కూడిన కేటగిరీ-1లో మొత్తం 1,025 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 4,53,531 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,134 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు 2,22,409 మంది, 1,501 వీఆర్వో, విలేజీ సర్వేయర్ పోస్టులకు 1,13,201 మంది దరఖాస్తు చేసుకున్నారు.

APPSC TSPSC Mock Tests

More applications for Animal Husbandry posts:

గత ఏడాది జూలైలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో 9,886 పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన Sachivalayam 2nd notificationలో 6,858 పశు సంవర్దక శాఖ పోస్టులకు 44,691 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే పోస్టులు తగ్గినప్పటికీ పోటీ భారీగా పెరిగింది.

APPSC Free Online Exams

త్వరలో హాల్ టికెట్లు:

మొత్తంగా దరఖాస్తులు సగానికి సగం తగ్గడంతో ఈసారి పరీక్ష ఏర్పాట్లు కూడా త్వరగా జరగనున్నాయి. ఫిబ్రవరి నెలాఖర్లో హాల్ టికెట్లు జారీచేసి మార్చి 2020లో సచివాలయం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే సీరియస్ గా ప్రిపేర్ కావాలి.



Leave a Comment

error: Content is protected !!