ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కు ఎంపికైనందుకు మీకు అభినందనలు. అత్యంత కీలకమైన మెయిన్స్ దశను కూడా అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాం. ఈ ప్రయత్నంలో మీకు ఉపయోగపడే విధంగా మాక్ టెస్ట్‌లను రూపొందించాం. వీటిని ఉపయోగించుకొని విజేతగా నిలుస్తారని ఆశిస్తున్నాం.
ఏపీపీఎస్సీ పరీక్షల విధానం ఇటీవలి కాలంలో చాలా మారిపోయింది. సిలబస్‌లో అనేక మార్పులతోపాటు ప్రశ్నల రూపకల్పనలో కూడా అనేక మార్పులు జరిగాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలకు, మ్యాచింగ్ టైప్ ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగింది. కరెంట్ అఫైర్స్, రాష్ట్ర విభజన తర్వాత సమస్యలకు ప్రశ్నపత్రాల్లో ప్రాధాన్యం పెరిగింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆయా సబ్జెక్టుల్లో నిపుణుల చేత ఏపీపీఎస్సీ మాక్ టెస్ట్‌లు రూపొందించడం జరిగింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మాక్ టెస్ట్‌ల ప్రత్యేకతలు:
1) సిలబస్, ఇటీవలి మార్పులను దృష్టిలో ఉంచుకొని మాక్ టెస్ట్‌ల రూపకల్పన
2) పోటీ పరీక్షలు, సంబంధిత సబ్జెక్టుల బోధనలో విశేష అనుభవం ఉన్న నిపుణుల చేత ప్రశ్నల తయారీ
* విశ్లేషణాత్మక ప్రశ్నలు, మ్యాచింగ్ టైప్ ప్రశ్నలకు అధిక ప్రాధాన్యం.
* ఎంబెడెడ్ ప్రశ్నల తయారీ - వీటివల్ల ఒకే ప్రశ్నలో సంబంధిత అంశం గురించి మరింత సమాచారం లభిస్తుంది.
* నెగెటివ్ మార్కుల విధానం. దీనివల్ల నిజంగా ఏపీపీఎస్సీ పరీక్షలో నెగటివ్ మార్కుల ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు. తదనుగుణంగా సమాధానాలు గుర్తించడంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు.
* మాక్ టెస్ట్ పూర్తవగానే మీరు గుర్తించిన జవాబులు, సరైన జవాబులు అన్నీ చూసుకోవచ్చు.
* అసలు పరీక్ష మాదిరిగానే మాక్ టెస్ట్‌లకు టైమ్ ఉంటుంది. నిర్దేశిత టైమ్‌లోనే పరీక్ష పూర్తిచేయాలి. దీనివల్ల మీకు టైమ్ మేనేజ్‌మెంట్ అలవాటు అవుతుంది.
* అభ్యర్థుల అవగాహన కోసం కొన్ని ఉచిత మాక్ టెస్ట్‌లు కూడా ఇవ్వడం జరిగింది. పరిశీలించగలరు.
మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే... ఈ పరీక్షలు మీ కోసమే.
you can also buy access to this test from our Mock Tests Store
Super