Government of Andhra Pradesh has extened the last date for the submission of online applications for various posts in Grama Sachivalayams / Ward Sachivalayams. Candidates can now general OTPR and apply online at any of the grama sachivalayam / ward sachivalayam websites. Following are details:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Grama Sachivalayam Mock Tests for all Category – I Posts:
- ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 21 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోక రోజు గడువు పెంచడంతో 22 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
- మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
మారిన పరీక్షల షెడ్యూల్
సెప్టెంబర్ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి
సెప్టెంబర్ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు
సెప్టెంబర్ 7, ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి
సెప్టెంబర్ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి
సెప్టెంబర్ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి