Government of Andhra Pradesh has taken so many measures for the welfare of women in the state. Women and child welfare programmes are part of syllabus for competitive exams like Grama / Ward Sachivalayam. Candidates appearing for Sachivalayam exams should study these schemes, their targetted people and allocations etc. Following are some of the important women welfare programs of AP Government.
1) అమ్మ ఒడి:
పేదల ఇళ్లల్లో ‘అమ్మ ఒడి’ పథకం వెలుగులు నింపింది. బిడ్డలను చదివించుకోడానికి అడ్డుగా ఉన్న పేదరికం దీంతో తొలగిపోనుంది. 1 నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లి బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయం పడనుంది.
2) జగనన్న వసతి దీవెన:
పెద్ద చదువులను చదివించుకునేందుకు ‘జగనన్న వసతి దీవెన’ అమ్మలకు ఆసరాగా మారింది.
3) వేతనాలు పెంపుదల: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశావర్కర్లకు జీతాలు పెరిగాయి. అన్ని వయసులు, వర్గాల మహిళలకు పింఛన్లు అందుతున్నాయి.
4) ఇంటి స్థలాలు: ఈ ఉగాది నాడు 26.6 లక్షల మంది మహిళల చేతికి స్వంత ఇంటి స్థలమనే ఆస్తి అందబోతోంది. ఆ తర్వాత ఇళ్లకూ సహాయం సమకూరనున్నది.
5) రిజర్వేషన్లు: రాజకీయంగానూ మహిళలకు సింహభాగం దక్కింది. మంత్రివర్గంలోనూ, మంచి పదవుల్లోనూ మహిళలకు స్థానం లభించింది. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇందుకోసం ఏకంగా చట్టమే చేశారు.
6) దిశ చట్టం: ‘దిశ’ చట్టం మహిళలకు భద్రతనిచ్చింది. ఒక్క బటన్ నొక్కి దుండగుల భరతం పడుతున్నారు. దేశమంతా ఇపుడు మన ‘దిశ’ వైపే చూస్తోంది.