Following important current affairs in Telugu for AP Sachivalayam, APPSC and other related examinations. The summary of current affairs is given for quick review of the happenings in February 2020.
17వ బయో ఏసియా అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ లో ఫిబ్రవరి 17న ప్రారంభమైంది. ఇందులో జీవశాస్త్రాలు, ఔషధ, వైద్య చికిత్స విధానాలు, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఇతర అంశాలపై మూడు రోజులపాటు చర్చిస్తారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ ఘన విజయం సాధించింది.
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే కేంద్రం నుంచి రాష్ట్రాలను అందించే పన్నుల వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్పీకర్ గా పనిచేసిన అగరాల ఈశ్వర్ రెడ్డి మరణించారు. వీరు చిత్తూరు జిల్లాకు చెందినవారు. 1983లో స్పీకర్ గా పనిచేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ కు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.
వైఎస్ఆర్ పించన్ కానుక పథకం కింద ఫిబ్రవరి 17 నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. 54.68 లక్షల మంది లబ్ధిదారులకు కార్డులు అందచేస్తారు.
ఏపీ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మగా కుప్పం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఆర్య వైశ్యులకు రాయితీ రుణాలు అందిస్తారు.
వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేయడానికి రియల్ టైమ్ పర్యవేక్షణను ఏర్పాటు చేయనున్నట్టు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పసుపు కొనుగోలుకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నారు. రైతుల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం పసుపు మద్దతు ధర క్వింటాలుకు రూ.6850 గా నిర్ణయించింది.
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి తన పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐకి తొలి సీఈఓ జోహ్రి. రాజీనామాను బోర్డు ఇంకా ఆమోదించలేదు.
ఉగాండా అథ్లెట్ జాషువా చెప్తెగి 5 కిలోమీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నమోదు చేశారు. మొనాకోలో జరిగిన రన్ లో 12 నిమిషాల 51 సెకన్లలో రేసు పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
ఏపీలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల, 99 లక్షల 37 వేల 394 మంది అని తెలిపింది. పురుష ఓటర్లు 1,97,21,514, మహిళా ఓటర్లు 2,02,04378.
ఏపీలో ఎన్ఆర్ఐ ఓటర్లు 7436, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 4066 మంది. స్థానిక సంస్థలకు ఎన్నికలకు 45836 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెల్లడించారు.
కేంద్ర కాలుష్య నివారణ మండలి నిర్వహించిన సర్వేలో అత్యధిక శబ్ద కాలుష్య నగరంగా హైదరాబాద్ టాప్ లో నిలిచింది. హైదరాబాద్ లో శబ్ద కాలుష్యం 79 డెసిబుల్స్. తర్వాత స్థానాల్లో చెన్నై, ఢిల్లీ ఉన్నాయి.
అంటార్కిటికా ఖండంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ తొలిసారి రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వెల్లడించారు. అంటార్కిటికాలోని సైమోర్ ద్వీపంలో ఈ రికార్డు నమోదైంది.
పుల్వామా దాడిలో అమరులైన 40 మంది వీర జవాన్ల కుటుంబాలను కలవడానికి 61 వేల కిలోమీటర్లు ప్రయాణించి తన దేశాభిమానాన్ని చాటుకున్నారు కర్ణాటకకు చెందిన గాయకుడు ఉమేశ్ గోపీనాథ్ జాదవ్.
కరోనా వైరస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టిన కొత్త పేరు కొవిడ్ 19.
భారత దిగ్గజ డబుల్స్ ఆటగాడు లియాండర్ పేస్ బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. అలాగే రోటర్ డామ్ ఓపెన్ ఏటీపీ 500 టోర్నీలో రోహన్ బోపన్న జంట సెమీస్ కు చేరింది.
కాశ్మీర్ అంశంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇందులో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. పాకిస్తాన్ పర్యటనలో ఎర్డోగాన్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.
ఇటీవల చైనా సహా కొవిడ్ 19 బారిన పడ్డ ఇతర దేశాల నుంచి వచ్చిన దాదాపు 80 మందిని ఒడిశా ప్రభుత్వం ఇళ్లకే పరిమితం చేసింది. వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జపాన్ కు చెందిన విహార నౌక డైమండ్ ప్రిన్సెస్ లో ఉన్న భారతీయుల్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ నౌకలో ప్రయాణించిన 218 మందికి కొవిడ్ 19 వైరస్ సోకింది.
భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కోచ్ ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జీవిత సాఫల్య పురస్కారానికి (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ 2019) ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారత కోచ్ గోపీచంద్.
జపాన్ కు చెందిన విహార నౌక డైమండ్ ప్రిన్సెస్ లో ప్రయాణించిన వారికి కరోనా వైరస్ సోకింది. ఈ నౌకలో 138 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం.
ఏపీకి చెందిన మంగా అనంతాత్ముల అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. వర్జీనియాలోని 11వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ లో రిపబ్లికన్ పార్టీ తరపున ఆమె పోటీ చేయనున్నారు. ఇక్కడి నుంచి ప్రతినిధుల సభకు పోటీపడుతున్న తొలి భారత సంతతి అభ్యర్థిగా ఆమె గుర్తింపు పొందింది.
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్ష భారత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారిని రాజపక్ష దర్శించుకుంటారు.
చైనాలో కరోనా వైరస్ కు కీలక కేంద్రంగా వుహాన్ నగరం వార్తల్లోకి వచ్చింది. ఈ నగరం సెంట్రల్ చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ లో ఉంది. కరోనా సోకినవారిలో 65 శాతంమందికిపైగా ఈ ప్రావిన్స్ కు చెందినవారే.
అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ లో భారత్, బంగ్లాదేశ్ లు తలపడనున్నాయి. బంగ్లాదేశ్ తొలిసారిగా ఈ టోర్నమెంట్ ఫైనల్ కు చేరింది. భారత్ ఇప్పటికే నాలుగుసార్లు అండర్ 19 ప్రపంచ కప్ గెల్చుకుంది.
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పాట్నాలోని మహవీర్ ఆలయ పాలక మండలి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించింది.
నేపాల్ యువ బ్యాట్స్ మన్ కుశాల్ మల్లా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అర్థ సెంచరీ సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా రికార్డు సాధించాడు. అమెరికాతో జరుగుతున్న మ్యాచ్ లో 15 ఏళ్ల 340 రోజుల వయసున్న కుశాల్ ఈ ఘనత సాధించాడు.
పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది.
ఇరాన్ రాద్ 500 అనే అధునాతన క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది కొత్తతరం ఇంజన్లతో రూపొందించిన బాలిస్టిక్ క్షిపణి అని ఇరాన్ వెల్లడించింది.
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత, రచయిత పి.పరమేశ్వరన్ కన్నుమూశారు. 2018లో పద్మవిభూషణ్ పొందారు. కన్యాకుమారిలో భారతీయ విచార కేంద్రాన్ని స్థాపించారు.
ఆస్కార్ ఉత్తమ చిత్రంగా దక్షిణ కొరియా సినిమా పారాసైట్ ఎంపికైంది. ఉత్తమ చిత్రంగా ఒక ఆంగ్లేతర విదేశీ భాషా చిత్రం ఎంపికవడం ఇదే తొలిసారి.
ఆస్కార్ ఉత్తమ చిత్రం: పారాసైట్
ఉత్తమ దర్శకుడు: బోన్ జోన్ హో
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: బాంగ్ జూన్ హో
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారాసైట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ బాధిత దేశాలను ప్రకటించింది. చైనా తర్వాత జపాన్, సింగపూర్, థాయ్ లాండ్, దక్షిణ కొరియా, తైవాన్, మలేషియా, ఆస్ట్రేలియా, జర్మనీ, వియత్నాం, అమెరికా, ఫ్రాన్స్, యూఏఈ ఎక్కువగా కరోనా బాధిత దేశాల్లో వరుసలో ఉన్నాయి.
భారతదేశంలో తొలిసారిగా ఒక కుక్కకు హృదయ సంబంధ పేస్ మేకర్ ను అమర్చారు. ఏడున్నర సంవత్సరాల ఖుషీ అనే కోకర్ స్పానియల్ జాతికి చెందిన కుక్కకు శస్త్ర చికిత్స ద్వారా దీన్ని అమర్చారు.
అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ ను ఓడించింది. ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అక్బర్ అలీ, మాన్ ఆఫ్ ది సిరీస్ గా భారత్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ఎంపికయ్యారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గత ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదైంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ఢిల్లీ, అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ట్రంప్ అధికారం చేపట్టాక భారత్ పర్యటించడం ఇదే తొలిసారి.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) విజయం దిశగా దూసుకెళ్తుంది. అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.
వ్యవసాయరంగంలో విజ్ఞాన మార్పిడి, రైతులకు శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఎస్సీ, ఎస్టీ చట్టానికి 2018లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ రాజ్యాంగ బద్దమేనని సుప్రీం కోర్టు సమర్థించింది.
బాబూ జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం మొత్తాన్ని తొలి ప్రాధాన్యంగా ఒకే దశలో, ఆరు ప్యాకేజీల్లో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏరోస్పేస్, రక్షణ రంగానికి చెందిన లాక్ హీడ్ మార్టిన్ కార్పొరేషన్ సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్టు పరిశ్రమల శాఖ వెల్లడించింది. ప్రకాశం జిల్లా దొనకొండలో ఏరోస్పేస్, రక్షణ రంగానికి చెందిన ప్రత్యేక సెజ్ ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ఆలోచన.
భారత్ కు 186 కోట్ల డాలర్ల విలువైన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. సైనిక దళాల ఆధునికీకరణలో భారత్ కు ఇది ఉపయోగపడుతుంది.
ఉరిశిక్ష ను రద్దు చేయాలంటూ కేరళకు చెందిన 88 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు పరమేశ్వరన్ నంబూద్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత శిక్షా స్మృతి ప్రకారం ఉరి శిక్ష కు వీలు కల్పిస్తున్న సెక్షన్ 354 (5) ను ఆయన సవాలు చేశారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కేంద్రం ఏర్పాటుచేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తొలిసారిగా ఈనెల 19న సమావేశం కానుంది.
జపాన్ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ ఇసుజు మోటార్స్ ఇండియా తమ రెండో దశ కార్యకలాపాలను చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ప్రారంభించింది.