Hall tickets for AP grama / ward sachivalayam exams will be available on Grama Sachivalayam and Ward Sachivalayam portals from 12th September 2020. The exams will be held from 20th to 26th September 2020. Category 1 exams will be conducted on the first day, that is 20th September 2020. More details are given below.
రాతపరీక్షల షెడ్యూల్ ఇలా..
తేదీ | ఉదయం | మధ్యాహ్నం |
20-09-20 | పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ | డిజిటల్ అసిస్టెంట్ |
21-09-20 | వీఆర్వో, విలేజ్ సర్వేయర్ | ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ |
22-09-20 | వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ | వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ |
23-09-20 | విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ | వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ |
24-09-20 | వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ | ఏఎన్ఎం/వార్డు హెల్త్ సెక్రటరీ |
25-09-20 | విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ | విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ |
26-09-20 | విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ | విలేజ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ |
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబర్12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 16,208 పోస్టులు అందుబాటులో ఉండగా.. 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి. ఏడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున 14 రకాల రాత పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఓఎమ్మార్ షీట్ల ముద్రణ ఇప్పటికే పూర్తయిoదని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు మధ్య తగిన దూరం పాటిస్తూ.. పెద్ద తరగతి గదిలో 24 మంది చొప్పున, మధ్యస్తంగా ఉండే గదిలో 16 మంది చొప్పున సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.