ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో గ్రామ సచివాలయం , వార్డు సచివాలయం పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించనుంది. జనవరి 2020లో విడుదల చేసిన రెండో నోటిఫికేషన్ పరీక్షలు మార్చిలో జరిగే అవకాశం ఉంది. 2019లో జరిగిన పరీక్షలో (కేటగిరీ 1 ఉద్యోగాల ప్రశ్నపత్రం) అడిగిన ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాం. అదే విధముగా ఆన్ లైన్ పరీక్షలు, మోడల్ పేపర్ల వివరాలు కూడా ఉన్నాయి.
పరిమితమైన అన్ని మంటలను ఆర్పుటకు సురక్షితమైన మరియు ప్రభావవంతమైన వాయువు
- నైట్రోజన్ డయాక్సైడ్
- కార్బన్ డయాక్సైడ్
- సల్ఫర్ డయాక్సైడ్
- నైట్రస్ ఆక్సైడ్
ANSWER: 2
బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదం దీనికి చెందింది
- ఒక అంతర్ముఖ కృత్రిమ మేధస్సు జీవ వైవిధ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం
- గరిష్ఠ జీవవైవిధ్యం ఉన్న ప్రాంతం
- మొక్కల వైవిధ్యం యొక్క అసాధారణ స్థాయిలు మరియు తీవ్రస్థాయి ఆవాస నష్టం కలిగిన ఒక ప్రాంతం
- జీవవైవిధ్య నష్టానికి గ్రహణశీలతను కలిగిన ప్రాంతం
ANSWER: 3
రామ్సర్ సరస్సు దీనికి సంబంధించి ముఖ్యమైంది
- ఓజోను పొర సంరక్షణ
- మాగాణి భూముల సంరక్షణ
- వన్య మొక్కల మరియు వన్య జంతువుల సంరక్షణ
- పులుల సంరక్షణ
ANSWER: 2
అవర్ కామన్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం పర్యావరణ సమస్యల యొక్క ప్రధాన కార్యకారణ సంబంధం ఏది?
- పేదరికం
- జనాభా
- పారిశ్రామికీకరణ
- కాలుష్యం
ANSWER: 1
TRADEMARK అనే పదం నుంచి 1వ, 3వ, 5వ మరియు 6వ అక్షరములతో ఎన్ని అర్థవంతమైన పదములను ఒక అక్షరమును ఒకసారే ఉపయోగించి తయారుచేయవచ్చును.
- ఒకటి
- రెండు
- మూడు
- నాలుగు
ANSWER: 4
రెండు ఎదురు ఎదురుగా వచ్చే రైళ్లు ఫ్లాట్ ఫారంపై నిలబడిన వ్యక్తిని వరుసగా 27 సెకన్లు మరియు 15 సెకన్లలో దాటిపోయినవి మరియు ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి 23 సెకన్లలో దాటినవి. ఈ రెండు రైళ్ల వేగముల నిష్పత్తి
- 3:2
- 3:4
- 2:1
- 1:4
ANSWER: 4
కొంత ధనమును బారువడ్డీకి ఇచ్చారు. ఇది రెండు సంవత్సరాలకు రూ.9248 మరియు 3 సంవత్సరాలకు రూ.9826 అయినవి. అయితే బారువడ్డీకి ఇచ్చిన ధనం ఎంత?
- రూ.8192
- రూ.8526
- రూ.8670
- రూ.8720
ANSWER: 1, 2, 3, 4
కిందివానిలో ప్రసిద్ధి చెందిన అగ్రస్థాయి డొమైన కానిది?
- .com
- .army
- .net
- .org
ANSWER: 2
లాగిన్ పేరు మరియు పాస్ వర్డ్ యొక్క ధృవీకరణను ఇలా అంటారు?
- కాన్ఫిగరేషన్
- సౌలభ్యత
- ప్రామాణీకరణ
- లాగింగ్ ఇన్
ANSWER: 3
యు.ఎన్.ఒ. లో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి
- శశిథరూర్
- సయ్యద్ అక్బరుద్దీన్
- జి. పార్థసారధి
- జి. రామస్వామి
ANSWER: 2
2019లో ఈస్టర్ రోజున శ్రీలంకలోని ఈ నగరాలపై బాంబు దాడి జరిగింది
ఎ. కొలంబో
బి. నెగొంబో
సి. బట్టికలోవ
పైవాటి నుంచి సరైన సమాధానం గుర్తించండి
- ఎ, బి
- బి, సి
- సి, ఎ
- ఎ, బి, సి
ANSWER: 4
2019 జూన్ 17న ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2019: హైలెట్స్ అనే ఒక నివేదిక ఈ సంస్థ ప్రచురించింది
- యునిసెఫ్
- యునెస్కో
- యూఎన్ఓ
- డబ్ల్యుహెచ్ఓ
ANSWER: 3
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఈ తేదీన గ్రామ సచివాలయాలు ప్రారంభానికి నిర్ణయించబడ్డాయి
- 14 నవంబరు 2019
- 1 నవంబరు 2019
- 2 అక్టోబరు 2019
- 15 అక్టోబరు 2019
ANSWER: 3
క్లయిమేట్ ఎమర్జన్సీ ప్రకటించిన రెండవ దేశం
- బ్రెజిల్
- ఐర్లాండ్
- ఇటలీ
- ఐస్లాండ్
ANSWER: 2
కిందివాటిలో సరికాని జతలను గుర్తించండి
ఎ. హీమోగ్లోబిన్ : చర్మం
బి. విటమిన్ సి : నీటి కాసులు
సి. పిండి పదార్థం : బంగాళాదుంప
డి. క్రొవ్వు : వెన్న
- ఎ, బి మాత్రమే
- బి, సి, డి మాత్రమే
- ఎ, డి మాత్రమే
- ఎ, బి, డి మాత్రమే
ANSWER: 1
భూతలం నుంచి చంద్రుని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు?
- 47 శాతం
- 34 శాతం
- 21 శాతం
- 59 శాతం
ANSWER: 4
ప్రింటర్ యొక్క నాణ్యత దీని ద్వారా కొలవబడును
- ఒక స్ట్రయిక్ కు అక్షరాలు
- ఒక అంగుళానికి పదాలు
- ఒక అంగుళానికి స్ట్రయికులు
- ఒక అంగుళానికి డాట్లు
ANSWER: 4